గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
దసరా పండుగకు మూడు రోజుల ముందు, మడికెట్ల నరుసువాయి ఆమె భర్త దుకాణంలకు పోయి, వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు కొత్త బట్టలు తెచ్చుకున్నరు. నాకు కొత్త బట్టలు తీసుకురాలేదు.
దసరా రేపు ఉంటే ఈ రోజు మానాయి. మానాయి నాడు పెద్దలకు(చచ్చిపోయిన వాళ్ళకు) రెండు ఇస్తర్లల్ల(విస్తరాకుల్లో) అన్నము, వండిన మాంసం కూర, కారాపప్పాలు,బెల్లపప్పాలు, బజ్జీలు, సిరపురీ పెట్టి, ఇస్తర్ల పక్కన రెండు కల్లు సీసాలు, రెండు పీటలు పెట్టిండ్రు. ఒక పీట మీద మగవాళ్ళ బట్టలు, ఇంకొక పీట మీద ఆడవాళ్ళ బట్టలు పెట్టిండ్రు.
తెల్లారి దసరా. అందరు స్నానం చేసి, పీటల మీద పెట్టిన కొత్త బట్టలను తొడుకున్నరు. ఆ రోజు మేకను కోసిండ్రు. మడికెట్ల నరుసువాయి మేక మాంసంతో నాలుగు రకాల కూరలు వండింది. ఒకటి కారం మసాలలు వేసిన గట్టి మాంసం కూర, రెండోది కారం లేకుండా, ఉప్పు మసాలా వేసిన గట్టి కూర, మూడోది కార్జాల(లివర్) ఫ్రై, నాలగవది ప్రేగుల(బోటి) ఫ్రై వండింది. ఇంకా మేక రక్తంను ఫ్రై చేసింది. బిర్యానీ వండింది.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45