గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
మడికెట్ల నరుసువాయి వాళ్ళకు, ఇద్దరు పొలాల పని చేసే జీతగాళ్లు ఉన్నరు.
ఒకరోజు పొలం పనులు లేవు. మడికెట్ల నరుసువాయి వాళ్ళకు, ‘అరే ఈరోజు ఏం పని లేదు కదా.. గుట్టకు పోయి సిత్పల కాయలు(సీతాఫలాలు) తెంపుకరండ్రి. ఇగో రెండు బార్దాన్ సంచులు’ అని ఇచ్చింది.
వాళ్ళు సరేనని సంచులు తీసుకొని గుట్టకు పోయిండ్రు.
ఆ ఊరికి, గుట్ట మూడు లేదా నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటది.
సాయంత్రం ఆరుగంటలకు, వాళ్ళు ఇంటికి వచ్చిండ్రు.
వాళ్ళు, ‘అవ్వ ఇగో, సిత్పల కాయలు’ అని ఆమె దగ్గర దించిండ్రు.
ఆమె, ‘కాయల్ని సంచులల్ల కెళ్ళి కింద గుమ్మరియ్యుండ్రు’ అన్నది.
వాళ్ళు గుమ్మరించిండ్రు.
ఆమె నన్ను పిలిచి, ఒక గుల్ల నాకు ఇచ్చి, ‘ఈ కాయలన్నీఈ గుల్లతోని ఎత్తుకుపోయి, బంగ్ల మీది అర్రల పొయ్యు’ అన్నది.
నేను, ఆ గుల్ల తోని, పదిహేను సార్లు మోసి అర్రల పొసొచ్చిన.
నేను, ‘అన్నీ అర్రల పోసేసిన’ అని ఆమెకు చెప్పిన.
ఆమె, ‘ ఇగో ఈ కీలీ(తాళం) ఆ అర్రకెయ్యు, యేసి కీల్చేతులు(తాళంచెయ్లు) నాకు తెచ్చియ్యు’ చెప్పింది.
నేను కీలి యేసి, కీల్చేతులు తెచ్చి ఆమెకి ఇచ్చిన.
మూడు రోజుల తర్వాత, ఆమె బంగ్ల మీదికి పోయి, సిత్పల పండ్లను గుల్లల తీసుకొచ్చింది.
పెద్ద పెద్ద పండ్లను ఆమె పిల్లలకు ఇచ్చి, ఆమె కోసం కూడా పెద్దయి తీసుకుంది. నాకు రెండు చిన్నవి ఇచ్చింది. అవి కాయలు ఉన్నయి.
ఆమెతో, ‘ఇవి కాయలు’ అన్న.
ఆమె, ‘కాయని గట్టిగ ఒత్తు, పల్గుతది.. అప్పుడు తిను, అవతలికి(బయటకు) పో’ అన్నది.
ఆ కాయని ఒత్తితే పల్గింది. అండ్ల అన్నీ పాలగింజలే ఉన్నయ్. తింటే గువ్వం సప్పగ ఉన్నది. యేం మంచిగ లేదు. రెండు అట్లనే ఉన్నయ్, రెండు తినకుండ పడేసిన.
‘వాళ్ళు పెద్దవి కమ్మగా తింటున్నరు. నేను గంతగానం పని చేసిన, పాపం అని కూడా ఇవ్వలేదు’ అని మనసులో దుఖంతో అనుకున్న. బాధపడుతు బయట బండ మీద కూర్చున్న.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45