Gangaa – Part 35

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

నేను అవతల(బయట) బండల మీద కూర్చొని, బర్రెల పెండ కోసం చూస్తున్న. చాలా సేపయింది. ఒక్క బర్రె కూడా పెండ పెట్టలేదు.

మడికెట్ల నరుసువాయి నన్ను పిలిచి, అందరు తిన్న తాటీలు(ప్లేట్లు), గిన్నెలు, ముంతలు(చెంబులు) బాగా తోమి, మంచిగా కడిగి తీసుకురా అని చెప్పింది.

నేను అవన్నీ తీసుకొని బావి దగ్గరకు వెళ్ళి పెట్టిన.

నేను, ఆ బావి గోడ ఎత్తు కూడా లేను. కోర(బొక్కెన)ను బావిలో వేసి, తాడు పట్టుకొని బావిలోకి కోరని జార విడిచిన.

నీళ్ళలో కోర మునగగానే, తాడు పట్టుకొని చేదిన. కోర మీదికి రాగానే నా కాళ్లు మీదికి లేపి, కోరను అందుకొని నీళ్ళను బకెట్ లో పోసిన. అట్లా మూడు కోరలు చేది బకెట్లో నీళ్ళు నింపిన.

తర్వాత బాసండ్లు అన్నీ తోమి, ఆ బకెట్ల నీళ్ళతోని కడిగిన. బాసండ్లు తీసుకోపోయి, పొయ్యి దగ్గర పెట్టి, ఆమెకు తోమిన అని చెప్పిన.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45