గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
మడికెట్ల నరుసువాయికి నలుగురు పిల్లలు ఉన్నరు. ఒక కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు.
కొడుకు పేరు మట్టయ్య, పెద్ద బిడ్డ పేరు విషమ్మ, నడిపి బిడ్డ పేరు సుబ్బమ్మ, చిన్న బిడ్డ పేరు కంటమ్మ.
మడికెట్ల నరుసువాయికి ఈ పిల్లలంటే బాగా ప్రేమ.
వాళ్ళకు రోజు చిక్కటి పాలు పోసేది.
మీగడ పెరుగు పెట్టేది.
కోడి గుడ్లు ఉడికించి పెట్టేది.
కోడి కూర వండి, దాచిపెట్టి, ఆమె నలుగురి పిల్లలకు పెట్టేది.
వాళ్ళకు పెట్టేముందు, నాకు ‘అవతలికి పో.. మంది బర్లు రోడ్ల మీద నుండి పోతయ్.. అవి పెండ పెడితే, తెచ్చి బండల మీద పిడకలు సరుపో’ అని, నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేది.
నేను చూసిన అని కూడా నాకు పెట్టేది కాదు. నేను అవతల(బయట) బండల మీద కూర్చొని, బర్రెల పెండ కోసం చూస్కుంటు ఉండేదాన్ని. అట్లా నాకు, మడికెట్ల నరుసువాయి పని చెప్పి నన్ను ఇంట్లో ఉండనిచ్చేది కాదు.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45