Gangaa – Part 32

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

ఒక చేతిలో పేలుక ముల్లె పట్టుకొని, ఇంకో చేతిలో డబ్బా పట్టుకొని పొలంకి వెళ్తున్న.

అప్పుడు, నాకు సుప్రియ ఎదురైంది.

‘ఎక్కడికి వెళ్తున్నావ్?’ అని అడిగింది.

‘పొలంకి, పిట్టలకాయ పోతున్న’ అన్న.

‘అబ్బా, నేను కూడా నీతో వస్తా’ అన్నది.

‘సరే రా’ అన్న.

ఇద్దరం కలిసి పొలంకి పోయినం.

మంచె మీదకి ఎక్కి కూర్చున్నం. నేను డబ్బని గట్టిగా కొట్టిన. పిట్టలన్నీ లేచిపోయినయ్.

నేను, ‘రొట్టె తిందం అబ్బా’ అన్న.

‘సరే’ అన్నది.

పేలుక విప్పిన. దాంట్లో మక్క రొట్టె, పొడికారం ముద్ద(నీళ్ళతో తడిపిన పొడికారం ముద్ద) ఉంది. మక్క రొట్టెను రెండు ముక్కలు చేసి, నేను సగం తీసుకొని, సుప్రియకి సగం ఇచ్చిన.

సుప్రియ,’గంగా.. ఏం మంచిగ లేదబ్బ’ అన్నది.

నేను, ‘అవును ఆమె నాకు రోజు ఏం మంచిగ లేనివే పెడతది. నాకు తినబుద్ది కాదు కానీ ఆకలయి ఏం మంచిగ లేకున్నా అదే తింట’ అన్న.

ఇద్దరం తిన్నం.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45