Gangaa – Part 29

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

సుప్రియ(మడికెట్ల నరుసువాయి తమ్ముడి కూతురు) నాతోనే ఎక్కువ మాట్లాడతది.

ఒక రోజు సార్ పాఠం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత,

‘గంగ మన స్కూల్లో ఆ బోడ బావి(గోడలు లేని బావి) దగ్గర మట్టి తవ్విన కొద్ది చాక్ పీస్ లు ఎల్లుతున్నయ్ అట’ అన్నది.

‘నీకెట్ల తెలుసు’ అన్నాను.

‘అందరు అంటున్నరు’ అని చెప్పి,

‘డ్రిల్ బెల్ అయినంక పోయి తెచ్చుకుందం’ అన్నది.

నాకు భయమైంది.

నేను మనసులో –

‘చాక్ పీస్లు తెచ్చుకుందాం అంటున్నది. సార్లు చూస్తే ఈ చాక్ పీస్లు స్కూల్లోనే ఉంటవీ. దొంగతనంగా తీసుకుపోతున్నరని సార్ కొడితే? నేను వెళ్ళను.’ అని అనుకున్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45