గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
నేను మూడవ తరగతి.
క్లాస్ కి సార్ వచ్చిండు.
‘మన స్కూల్లో పంద్రాగష్ట్ కి ఆటల, పోటీలు ఉన్నయ్. గెలిచిన వాళ్ళకు ప్రైజ్ లు కూడా ఇస్తరు.’ అని మా అందరికీ చెప్పిండు.
అటెండెన్స్ తీసుకొని, పాఠం చెప్పిండు.
ఇంటర్వెల్ బెల్ కాగానే అన్నీ క్లాసుల పిల్లలను పిలిచి రన్నింగ్ పోటీ పెట్టిండు.
సార్ ఒక గీత గీసి దాని దగ్గర పిల్లలను నిలచోపెట్టిండు.
‘పిల్లలూ.. నేను వన్, టూ, త్రీ అనగానే మీరు పరుగెత్తాలి. ఒకరికి ఒకరు తాకద్దు. అక్కడ ఇంకో సార్ నిలబడ్డడు కదా, అక్కడ ఇంకో గీత కూడా ఉంది. ఆ గీతను ఎవరు ముందు దాటుతరో వాళ్ళు గెలిచినట్టు’ అన్నడు.
సార్, ‘వన్, టూ, త్రీ..’ అనగానే పిల్లలందరం పరుగెత్తుతున్నం.
ఇంకో సార్ చాలా దూరంలో ఉన్నాడు అంటే ఆ గీత చాలా దూరం ఉన్నది.
నేను స్పీడ్‌గా పరుగెత్తుతున్న. నాతో పరుగెత్తుతున్న వాళ్ళు నన్ను దాటి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను వాళ్ళకంటే ఇంకా స్పీడ్‌గా పరుగెత్తుతున్న. సార్ దగ్గరకు నేనే ముందు వచ్చి, ఆ గీత దాటి నిలబడ్డ.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45