గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
రాసినవారు: గంగా
నేను ప్రొద్దున లేచిన.
ఆమె, ‘గంగా.. పొలంకి పోయి, పిట్టలు కాయుపో..’ అన్నది.
‘పిట్టలు ఎట్లా కాయాలి?’ అని అడిగిన.
ఆమె, ‘ గాంచు నూనె (కిరోసిన్) డబ్బా ఖాళీది ఉన్నది ఇస్తా. అది, ఒక కట్టే తీసుకొని, పొలానికి పోయి, పిట్టలు కాయు.’ అన్నది.
‘డబ్బా, కట్టే ఎందుకు?’ అన్న.
ఆమె, ‘పొద్దుగల్లా పొలాలకి బాగా పిట్టలస్తయ్. అవి వడ్ల గింజల పాలన్నీ తాగేస్తయ్. పిట్టలు పొలంలకి రాంగానే, ఆ డబ్బని కట్టేతోని గట్టిగ కొట్టు. అవి సప్పుడుకు ఎగిరిపోతయ్. ఎండకాసినంక, అవి పోతయ్. అప్పుడు ఇంటికి రా’ అన్నది.
‘అలాగే’ అన్న.
ఆమె ఇచ్చిన డబ్బా, ఒక కట్టే తీసుకొని పొలానికి పోయిన.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45