గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
అది చలికాలం..
ప్రొద్దున..
బాగా చలి పెడుతున్నది. ఆమె నాకు ఒక చీపురు ఇచ్చి వాకిళ్ళు ఊడవమని చెప్పింది.
ఆ చీపురు దొడ్డుగా, చిన్నగా ఉన్నది. అది నాకు పట్టుకోవస్తలేదు.
‘ఏమైందే ఊడవమంటే అట్లనే నిలబడ్డవ్’ అన్నది.
‘ఎలా ఊడవాలి నా చేతిలో పడతలేదు’ అన్నాను.
ఆమె కోపంతో వచ్చి నా కుడి చేతిని పట్టుకొని, నా రెండు వేళ్ళ మద్యన చీపురు పెట్టి,
‘ఇలా పట్టుకొని ఊడవాలి’ అన్నది.
నాకు వేళ్ళు నొస్తున్నవి. అది పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మూడు వాకిళ్లు, నాలుగు పానాదులు ఉన్నవి. అవన్నీ ఊడవమని చెప్పింది.
ఆమె చెప్పినట్టు వేళ్ళల్లో చీపురు పెట్టుకొని ఊడిస్తే చేయి, వేళ్ళు బాగా నొస్తున్నాయని, చీపురును రెండు చేతులతో పట్టుకొని ఏడుసుకుంటూ అన్నిటినీ ఊడిచాను. చాలా సేపయింది. చేతులు బాగా నొస్తున్నాయి.
ఆమె మళ్ళీ వచ్చి చూసి, ‘ఇదేం ఊడచావే, చెత్త అంతా అట్లనే ఉన్నది.’ అని నన్ను చెంపల మీద గట్టిగా కొట్టి అన్నిటినీ మళ్ళీ ఊడిపించింది.
నాకు చచ్చిపోవాలని అనిపించింది. ఎలా చావలి అనుకున్న.
రాసినవారు: గంగా
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45