చెలియా – కవిత

నేల నింగి నడుమ పూపల్లకిలో నిను విహరింపజేయనా….

మరల మది మరవనన్న నీ జ్ఞాపకాలను బహుమానంగా ఇవ్వనా…

నసాధ్యమన్న నీ స్వప్నలోకపు తలపులను నిజం చేయనా…

“నీ ఊహల వలయింలో చిక్కుకొని మది నా జాడ మరిచెనో”

“నా హృదయ తామసి తెరలు తెంచి నీ చిరునవ్వు వెలుగు నింపెనో”

కడలి అలల వాలే నీ కురులు పొంగగా…

ముత్యమై  కుసుమం నీ జడన మెరువగా…

బాల భానుని తేజంతో వెలిగే నీ రూపు చూడగా…

మేఘ చంద్రుని అందంతో నీ మోము నిండగా…

“పడతి నీ ముంగిట చేరితి నీకు దాసోహమై”

“సఖి నను నే మరచితి నను చుసిన ఆ నమిషమై”