సెల్ – కవిత
ఎవరి చేతిలో చూసినా సెల్
సెల్ హల్ చల్
చెవిలో ఇల్లు కట్టుకొని
సెల్ కబుర్లు
సెల్ స్క్రీన్ చూసి చూసి
చాటింగ్ చేసి చేసి
కంటికి బహుమతి
సోడాబుడ్డి కళ్ళద్దాలు
సెల్ లేదంటే నేడు
జీవితమే శూన్యం
ఉదయమే కనిపించాలి సెల్
లేదంటే హెల్
సెల్ కోసం పిల్లల గోల
సెల్ తో ఆటలు ఆడి ఆడి
చేతులకు వచ్చు
బోలెడు నరాల జబ్బులు
మనుషులు సెల్ కు బానిసలు
సెల్ లో చాటింగ్ చేస్తూ
సెల్ఫీలు దిగుతూ
ప్రాణాలు పోతున్నా
మనకు కలుగదు కనువిప్పు