మెల్లమెల్లగా గగనతారాలు ఆరిపోతుంటే నీలాకాశం బోసిపోతుందేమో అనుకున్న నిమిషాన ఎర్రటి పండు పురుడు పోసుకొని నల్లటి మబ్బులలో నుండి.. తన చూపులను ధరణి వైపు వేసాడు.. నిర్జీవంగా నిద్రిస్తున్న నా దేహాన్ని రుధిరలోకం తట్టి లేపి మదనలోకం వచ్చినది విధి నిర్వహణకై అడుగులు వేయమన్నది.
వీచే గాలి, ఎగిసే పైరు.., కురిసే వాన, మెరిసే మెరుపు …, ఆలపించిన ఆరాట ప్రవాహం. సంగీతం…, చల్లనినీరు సాగే సంద్రపు జోరు …., ప్రకృతి సెలయేరు,…