నువ్వు నింగి – నేను నేల ఎప్పటికీ
మనం కలవలేమన్నావు
కానీ ఆ అనంతకాశంలో భూమి ఒక బిందువని మరచిపోయావా….
నువ్వు సముద్రం – నేను నది
మనకు సరిపడదన్నావు
కానీ చివరకు నది కలిసేది ఆ సముద్రంలోనే
అని మరచిపోయావా….
నువ్వు కొండ – నేను లోయ
మనిద్దరికీ పొసగదన్నావు
కానీ కొండ లోయ రెండూ
విడదీయరానివని మరచిపోయావా….
నువ్వూ నేనూ ఇంద్రధనుస్సులోని రెండు రంగులం మాత్రమేనన్నావు
కానీ ఈ రెండు రంగులు లేకపోతే
ఆ ఏడు రంగుల హరివిల్లుకి అర్థమే
లేదని మరచిపోయావా….
నువ్వు వేరు నేను వేరు అన్నావు
కానీ నా ప్రాణమే నీవు అయినప్పుడు
మనం వేరెలా అవుతాం??
ఆలోచించు ప్రియా..
ఒక్కసారి ఆలోచించు…
పోలిక అద్భుతం … మంచి కవిత