Gangaa – Part 44

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

దీపావళి పండుగునాడు, మడికెట్ల నరుసువాయి నన్ను మస్కున 5 గంటలకు లేపింది.

అరుగులు, ఆకిళ్ళు నూకెసి(ఊడ్చేసి) అలుకు చల్లుమన్నది. ఇంకా ఇంట్లో ఉన్న దర్వాజల కడపలన్ని కడిగి జాజు పెట్టి, ముగ్గులేసి వాటికి పసుపు కుంకుమ పెట్టుమన్నది.

నేను అరుగులు, ఆకిళ్ళు, పానాదులు నూకేసి అలుకు చల్లిన. తర్వాత ఇంట్లో ఉన్న దర్వాజల కడపలన్ని కడిగి జాజు పెట్టి, ముగ్గులేసి అన్నీ కడపలకి పసుపు కుంకుమ పెట్టిన.

నేను అలుకు చల్లేటప్పుడు, నా మీద అలుకు పడింది. మొత్తం తడిసిపోయిన. చలి పెడుతున్నది.

పండ్లు తోముకోదందుకు, బొగ్గు కోసం పొయ్యి దగ్గరికి పోయిన. బొగ్గు తీసుకొని బావి దగ్గరికి పోయి మొహం కడుక్కొని, చన్నీళ్లతో స్నానం చేసిన. బాగా చలి పెట్టింది. బయటకు పోయి, ఎండలో బండల మీద కూర్చున్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45