గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
దసరా అయిన తర్వాత రోజు..
మడికెట్ల నరుసువాయి భర్త, మేక తలకాయను, మేక కాళ్ళను మంటలో కాల్చి నన్ను పిలిచిండు.
ఆమె భర్త, ‘నేను మేక తలకాయ, కాళ్లు కడుగుత.. నీళ్ళు పోద్దు రా..’ చెప్పిండు.
నేను బావిలో నుండి నీళ్ళు చేది బకెట్ నింపిన. ఆమె భర్త, మేక తలకాయను, కాళ్ళను ముక్కలు ముక్కలుగా కత్తితో నరికిండు. నేను నీళ్ళు పోసినకొద్ది ఆ ముక్కలను కడుక్కుంటూ, ఒక బగోనిల వేసిండు. ఆ బగోనిని నాకు ఇచ్చి మడికెట్ల నరుసువాయికి ఇయ్యమన్నడు. నేను తీసుకుపోయి, ఆమెకు ఇచ్చిన. ఆమె కూర వండింది. వాళ్ళందరూ తిన్నరు. వాళ్ళు తిన్న తర్వాత నన్ను పిలిచింది. అన్నం ప్లేట్లో వేసి మూడు బొక్కలు, సోర్వ పోసింది. ‘ఇగో తిను’ అని ఇచ్చింది. దూరంగా కూర్చోమన్నది. దూరంగా కూర్చొని సోర్వతోని అన్నం కలుపుకొని తిన్న. బొక్కలను కుక్కలకు వేసిన.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45