గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
వర్షంలో తడిసినందుకు, మళ్ళీ ఆమె పాచి అన్నం పెట్టినందుకు నాకు చాలా జ్వరం వచ్చింది.
నేను మధ్యాహ్నం ఏమి తినలేదు.
చీకటి అయింది.
నేను బడకల్ల, నిండా దుప్పటి కప్పుకొని పండుకున్న.
నన్ను ఎవరు కూడా అన్నం తిను అనలేదు.
చాలా సేపటికి అంటే ఒక రెండు, మూడు గంటల తర్వాత, ఆమె భర్త వచ్చి పిలుస్తున్నడు.
నేను దుప్పటి తీసి చూసి ‘ఏందీ’ అన్న.
‘లెవ్’ అన్నడు కోపంతో.
‘నాకు చలి పెడుతున్నది’ అన్న.
‘లెవ్ లేసి బడక దిగు’ అన్నడు.
నేను లేసి, బట్టల నుంచి పక్కకు జరిగి నిలబడ్డ.
‘ఆ శాప తీయ్’ అన్నడు కోపంతో.
అర్దం కాలేదు నాకు ‘ఏందీ’ అన్న.
‘లెవ్’ అని అతనే శాప తీసిండు.
శాప తీసి దులిపిండు. దాంట్లో నుండి కట్లపాము పడ్డది.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45