గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
నాకు అప్పుడు అయిదు లేదా ఆరు ఏండ్లు ఉన్నాయనుకుంటా.
ప్రొద్దున..
నేను గాఢ నిద్రలో ఉన్న.
నా మీద ఉన్న దుప్పటిని తీసి పక్కకు పడేసి ‘లెవ్.. లేసి, ఆ పొయ్యిల బూడిద ఎత్తి, బాసండ్లు తోము’ అన్నది ఆమె.
నేను ఒక ప్లేటు తీసుకొని వెళ్ళి, పొయ్యిలో ఉన్న బూడిదలో చేయి పెట్టిన.
నా చేతికి అగ్గి నిప్పుక తాకినట్టయి కాలింది. వెంటనే చేయి బయటకు తీసి చూసిన. నా చేతికి ఏమి లేదు.
మళ్ళీ పొయ్యిల చేయి పెట్టి బూడిదని పట్టుకున్న, మళ్ళీ కత్తన కాలింది. బాగా మంటగా ఉంది.
చేయి పైకి తీసిన. నా చేతి వేలుకి పెద్ద తెల్లటి తేలు వేలాడుతున్నది.
నాకు భయం వేసి అరిచాను.
చేయి జడిచ్చిన, అది కింద పడ్డది.
నేను ఏడుస్తున్న.
ఆమె వచ్చి, ‘ఏమైందే ఏడుస్తున్నావు..’ అని నా వీపు మీద గట్టిగా కొట్టింది.
నేను ఆ తేలును చూపించిన. నా వేలుకు కుట్టింది అని, నా వేలుని చూపించిన. నా వేలు నుండి బాగా రక్తం కారుతున్నది.
ఆమె నా వేలుని చూసి కూడా ‘ఆ.. ఏమి కాదు. వెళ్ళి బాసండ్లు తోము పో..’ అన్నది.
నా వేలు చాలా మంటగా నొప్పిగా ఉన్నది.
నేనెలా తోమాలి. తోమకపోతే నన్ను కొడుతది.
రాసినవారు: గంగా
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45