తూర్పున ఎగసే పశ్చిమ ముగిసే సూర్యుడు చెప్పిన
కథ ఒకటుంది అదేగా కాల చక్రము..
ఎవరి కోసం ఆగని ధర్మ సూత్రము….
వీచే గాలికి ఊగే జీవం కలిగే వృక్షము నేర్పిన
మాటొకటుంది అదేగా ధైర్యము …
దయ దాన గుణ సంపన్నము…..
వంపుగ నడిచే సొంపుగ సాగే నదము
పలికిన పలుకొకటుంది అదేగా ఆవేశగమ్యం..
తెలుసుకోదగిన జీవన లక్ష్యం…
మనిషికి మనిషికి మధ్యన మెలిగే మైత్రి
నేర్పిన వాక్కొకటుంది అదేగా జీవనగమనం.
పెంచుకో మైత్రి మమకారం…
తడిచే నేలకు కురిసే మబ్బుకి మధ్య లోకమే
ఇచ్చిన తీర్పొకటుంది అదేగా ప్రపంచం…
తెలుసుకో దానినే సమస్తం….