విశ్వ సృష్టిలో ఆ ఈశ్వరుడి మహాద్భుతం స్త్రీ..
కూతురై ఇంటింటా మహాభాగ్యాన్నిచ్చును స్త్రీ..
భార్యయై పతి కష్టసుఖములలో తోడుండును స్త్రీ..
తల్లియై తన సంతానానికి అండదండవును స్త్రీ..
నేటి సమాజం స్త్రీ యొక్క విలువ మరువగా
అవివేకంతో మహిళను చిన్నచూపు చూడగా
కట్నం పేరిట మహిళలకు వేదనలు జరుగగా
కులం పేరిట సమాజం అవహేళన చేయగా
“కాసుల కొరకు జనులు వైకుంఠ లక్ష్మిని పూజించెను..
ఇంట పుట్టిన మహాలక్ష్మిని చెత్తకుండిన పడవేసెను..”
“ప్రేమ పంచిన మాతృమూర్తిని చేర్చెను వృద్ధాశ్రమము..
కన్నతల్లి తమకు భారమనిపించే ఇది ఎక్కడి ధర్మము..”
ఎక్కడ మహిళ మనోవేదనకు గురి అగునో..
ఎక్కడ స్త్రీ విలువలకు భంగం కలుగునో..
అచ్చట మొదలగును స్త్రీ శక్తితో ఓ మహా ఉద్యమము..
నవయుగ నిర్మాణ బాటలు వేయును ఆ ప్రభంజనము..