ఓ సహృదయులైన జనులరా…
ఇది బుద్దిమంతులకు కాదు
బుద్ధిహీనులకే సుమా….
ఓ స్త్రీ నీ పుట్టుకే ఒక అద్భుతం,
మొక్కలోనే త్రుంచే కఠిన్యులు ఎందరో గదా
ఓ స్త్రీ నీ ఎదుగుదల కూడా ఒక అద్భుతం,
అడుగడుగున ఇంటా బయట కామాంధులు ఉండగా
ఓ మనిషీ తెలుసుకో
నీ పుట్టుకకు ఒక స్త్రీ కావాలని తెలీదా
అక్కా అమ్మా చెల్లిగా ఆమె పంచే అనురాగం తెలీదా
పురాణాలు, వేదాలు స్త్రీ కి ఇచ్చిన పాత్ర తెలీదా
భార్యగా జీవితాంతం ఉత్తి వెట్టి చాకిరీతో బాటు
నేడు సంపాదనలో నీకు ఇచ్చే చేదోడు తెలీదా
నీ పిల్లల భవితకు-నీ ఇంటి వెలుగుకు
కారణం నీకు తెలీదా
అసలు సమాజ వికాసానికి స్త్రీ పాత్ర తెలీదా
మరి అన్నీ తెలిసీ
జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు
ఎక్కడివి..? ఎందుకు..?
స్త్రీ తిరగబడితే బ్రతుకే దుర్లభమని తెలీదా
దేవతలు సైతం శపిస్తున్నారు అని తెలీదా
ఉన్నతం గా ఆమెను భవిద్దాం
అమ్మ, సహోదరిగా చూద్దాం
చిటికెడు ప్రేమను పంచుదాం
స్త్రీ సభ్య సమాజం లో ఉందని తెలుపుదాం
వారి స్థానాన్ని సుస్థిరం గా, సగౌరవం గా ఉంచుదాం
సమాజంలో మన గౌరవాన్ని కాపాడు కుందాం
ఆడదైన భరతమాత ను ప్రశాంతంగా ఉండనిద్దాం