అక్షరమే ఓ సంద్రమై….
కవిత్వమే నడి నావలా…
కలం చేతపట్టి కవి సారథి లా…
నవజీవన విలువల వివరణా…
సాహిత్యం సమాజం సాగుతోంది..
కవి భావన నేటికీ బ్రతికి ఉంది….
సామాజిక క్షేమ మే ధ్యేయంగా…
యువత భవిత నే ఆయుధం గా…
ప్రపంచం మే తన సర్వస్వం గా…
కవితా లోకమే నివాసంగా….
ప్రకృతి లో తన పోలికగా…
మంచే తన మచ్చికగా…
విప్లవాత్మక వాక్యాలుగా…
భావుకతే పవిత్రం గా…
సమాజం లో వ్యక్తులుగా..
సామాజిక చైతన్యానికి వక్తలుగా…
సాహిత్యమే నడుస్తోంది…
నేటి భవితా బాటలు పరుస్తోంది…
యువతకు బాధ్యత నేర్పుతుంది…
మాతృభాషా పయనం మేలుకుంది…
భరతమాత కు ఋణం తీర్చుతోంది…