ప్రియమైన “నీకు”
నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజేయాలని, ఈ లేఖ ద్వారా నా చిన్ని ప్రయత్నం. కానీ….
నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా.. అని అనుమానం కలుగుతోంది. అంటే ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అని అనడం కన్నా, నిన్ను ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది.
ఈ భావం ఎంత మధురంగా ఉంది అంటే
“నా నుండి నేను వేరయి నీలో కలసిపోతున్న భావన”
అలా జరుగుతున్న పక్షంలో “నేను” అన్న పదానికి అర్థమే లేదు. అంటే..
నువ్వు అంటేనే నేను…
నేను అంటేనే నువ్వు…
నువ్వూ నేనూ ఒకటే అయినపుడు మనం కలిసిలేమనే భావనే లేదు..
నువ్వు ఈ జన్మలో పంచిన ప్రేమకి ఋణం తీర్చుకోవాలంటే, నేను మరుజన్మ వరకూ ఆగాల్సిందే.
మరుజన్మలో కల్మషం లేని ప్రేమని పంచేలా, నీకు తల్లిగా పుట్టించమని
లేదా..
నీ ముక్కు పిండి మరీ ప్రేమని వసూలు చేసేలా, నీ కూతురుగా పుట్టించమని
మృత్యువు సమీపిస్తున్న వేళ ఈ జన్మలో ఆ దేవుడి నుండి మాట తీసుకుంటాను….
ఈ జన్మకు పరిపూర్ణంగా నీ ప్రేమని అందుకోలేని
నీ
అనుకునే
“నేను”
Related
ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉంటాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు ఆ పాములవాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను ఆపాముబుట్టలో వేసి తన పాముకు మంచి ఆహారం దొరికింది అని ఆనందిస్తాడు. పాము ఆకలిగా ఉండటంతో ఎలుకను తినడానికి ప్రయత్నించగా ఎలుక ఓ పాము రాజ నన్ను తినకు నీకు కావాలి అంటే నేను ఒక…
In "Magazine"
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. రోజూ వేటాడి తెచ్చుకున్న మాంసం ఇంటికి వచ్చి తినేది. అలా ఒక రోజు మాంసం తింటూ ఉండగా ఒక ఎముక తన గొంతులో ఇరుక్కుంటుంది. ఆ బాధ భరించలేక నక్క అడవంతా పరుగులు తీస్తూ ‘నా గొంతులో ఉన్న ఎముక ఎవరైనా తీస్తే వారికి నేను మంచి బహుమానం ఇస్తాను’ అంటుంది. …
In "Aug 17"
సమాజం “తొందరగా డబ్బులు కట్టు అమ్మాయి రూంలో ఎదురుచూస్తుంది”, పాన్ నములుతూ, పెద్ద గొంతుతో రేఖ సురేష్ తో అంది.సురేష్ తన దగ్గర వున్న డబ్బులు రేఖకు ఇచ్చి 203 రూంలోకి వెళ్ళాడు.అక్కడ- వాణి సురేష్ దగ్గరికి వచ్చి “ఎన్ని గంటలు?” అడిగింది. "2 గంటలు" అన్నాడు. “అబ్బో 2 గంటలా? ఏం చేద్దామనో ?” నవ్వుతూ అంది.సురేష్ ఏం బదులు ఇవ్వకుండా దర్వాజా దగ్గరే నుంచోని వున్నాడు. “సరేకానీ మంచం దగ్గరికిరా” అంది.సురేష్ అల మౌనంగానే వుంటూ ఎడమ కంటి నుంచి కన్నీటి దారాలు కారుస్తున్నాడు. “ఇదిగో ఏం…
In "Literature"
Too Nice and I really felt 2 dt