అంటున్నదా ప్రాయం …..
అన్నీ చేయగలనని…..
కోరుకుంటున్నాయా నయనాలు
రంగురంగుల విశ్వాన్ని
చెబుతున్నదా మనస్సు
సర్వంస్వహస్తాలలో ఉందని
ఉవ్వెత్తున ఎగిసె ఆలోచనలు
విహరిస్తున్నాయా స్వర్గపు ముంగిట్లో
నడిరేయి కళ ఆకాంక్షిస్తుందా
ఏదో సాధించాలని
లేత వయస్సు లేలెమన్నవేళ
తప్పుడు తోవ రారమన్నవేళ
చెడు చెలిమి చెంతకు పిలిచేవేళ
స్వల్ప సౌఖ్యాలు హృదయం ఆశించువేళ
నిగ్రహంవీడక,
సాగిపో సోదరా లక్ష్యం దిశకు
వెలుగరా మిత్రమా!
నలుదిక్కులకు జిలుగులు పంచేల.