నల్లగా కమ్ముకొస్తున్న ఒక్క కారుమబ్బు చాలు
సూర్యుని తాపం నుంచి ఉపశమనం కలిగించడానికి
మెరుపు మెరిసే ఒక్క క్షణం చాలు
కళ్ళలో వెలుగు నిండడానికి
తనువు తడిసే ఒక్క జల్లు చాలు
వర్షంలో తడిసి పోవడానికి
కొంటె చూపుతో నవ్వే ఒక్క చిరునవ్వు చాలు
గుండెలో ప్రేమ చిగురించడానికి
ఆకాశంలో విరబూసిన ఒక్క ఇంద్రధనస్సు చాలు
మన ప్రేమలో కొత్త రంగులు అద్దడానికి
ఉరుము ఉరిమే ఒక్క శబ్దం చాలు
నువ్వు నేను చేరువ అవ్వడానికి
వణుకు పుట్టిస్తున్న ఒక్క చిరుగాలి చాలు
మనమిద్దరం ఏకమవ్వడానికి
కాళ్ళను తాకుతూ పారుతున్న ఒక్క చిన్న జలపాతం చాలు
మనమిద్దరం ఈలోకం మరచి పోవడానికి
జలపాతంతో నిండుతున్న ఒక్క నదిగట్టు చాలు
ఈలోకంలో మనమిద్దరమే ఉన్నాం అనడానికి
అటువంటి మధురమైన క్షణాలు
నాజీవితంలో కూడా ఎదురు కావాలని
అని నీతో పంచుకోవాలని నా కోరిక