పాలసంద్రము నందు పవళించు తండ్రి
పాలిచ్చు తల్లికే పుట్టె చూడండి
రాతియే మెరిసేను నువుగాని మడితే
రేపల్లె మురిసేను నువు మురళి ముడితే
శివుని శిరముననున్న గంగమ్మ తల్లి
మా నెత్తికెక్కేను సూరీడు మళ్ళీ
ఎంత దాక్కుంటావు ఆ యెనకకెళ్ళి
వానజల్లై రావె మాయమ్మతల్లి
చల్లాని రామయ్య నాన్నకూ ముద్దు
నల్లాని కిట్టయ్య వెన్నకూ ముద్దు
ఎల్లాగ నీ ఆట చేరేను హద్దు
కాలాన ఈ పాట బంగారు పద్దు
ఇంద్రుడే చూడగా కొండనే మోసి
నీ తల్లి పాడగా నీ గొప్ప చూసి
నీ మనసు మెచ్చాడు ఆ సవ్యసాచి
నీ కతలు చెబుతాడు ఈ సత్యసాయి
చాలా బాగా రాసారు బ్రుందావనం సత్యసాయి గారు…కవిత లొ భావం చాల గొప్పది , లోతయినది