ఆరాటానికి ఆటంకం
అడ్డుగీత గీసిన
ఆలోచనతో వేసిన అడుగు
అందుకోదా ఆశల ఆకాశం….
దూసుకుపోతున్న నీకు
దురదృష్టం దారిన తగిలిన
దృఢచిత్తానికెప్పుడూ
దూరపు బంధువేగా…!
ఎదురీత నేర్చుకున్న నిన్ను
ఏ విధిరాత ఎదిరించిన
ఎడతెరిపి లేని కృషే
ఏలుతుంది నీ కలల రాజ్యాన్ని…