జగద్గురువు ఆది శంకర నమోస్తుతే
కులాల కుమ్ములాటలు మతాల మారణహోమాలు
అనాగరిక అరాచకాలు అజ్ఞానపు అంధకారాలు
ఆవరించి ఉన్న హిందూ సమాజ పరిరక్షణ
ద్యేయం గా ఆ పరమశివుడే ఎత్తిన అవతారం
రకరకాల ఆచారాలనడుమ గురువుల కలహాలు
పరమాత్మ స్వరూపం ఏకమని ఒప్పుకోని దురహంకారాలు
భాస్కరుడoట నిలకంఠుడట
ప్రభాకరుడoట మండలమిశ్రుడంట
ఒక్కరిద్దరా వందల మంది ఆధిపత్యం
అర్ధం లేని ద్వైతమనే వింత పైత్యం
అందరినీ ఓడించి ఏక తాటి పై నడిపి
సర్వజ్ఞ శారదా పీఠ మధిరోహనమొకపక్క
శివా నంద లహరి, సౌందర్య లహరి ఏ కాక
కనకధార భజగోవిందం స్తోత్రాలనేకం
రెండు వందల పైన రచనా రత్నాలను అందించి
భక్తులకుపరమాత్మ స్వరూపం తెలపడం ఒక పక్క
తల్లికి వందనం అమ్మ మాట పరిపాలన
మాతృమూర్తి ఆర్యాంబ కోసం కాలడి లో
ఇంటి ముంగిట పూర్ణనది నే నిలపడం
పరమాత్మ సాక్షాత్కారం చేయించి అమ్మకే మోక్షమివ్వడం
ఇలా ఎన్నెన్నో అద్భుతాలు చేసి
సన్యాసాశ్రమ నియమాల నిర్దేశం ఒక పక్క
తూర్పున ఋగ్వేద సంప్రదాయ శ్రీ గోవర్ధన పీఠం
పశ్చిమాన సామవేద సంప్రదాయ శ్రీ శారదా పీఠం
ఉత్తరాన అధర్వ వేద సంప్రదాయ శ్రీ జ్యోతిష్ పీఠం
దక్షిణాన యజుర్వేద సంప్రదాయ శ్రీ శృంగేరి పీఠం
ఈ పీఠాల స్థాపన వాటి కార్యాచరణ నియమాల నిర్దేశం ఒక పక్క
తిరగని క్షేత్రం లేదు దర్శించని పుణ్యభూమి లేదు
రూపు మాపని దూరహంకారo లేదు
ప్రతి గుడికి నియమాలు ప్రతి పూజకు విధానాలు
ప్రతి గురువుకి బోధనలు ప్రతి మనిషికి జాగ్రత్తలు ఆ నాటికి మాత్రమే కాదు నేటికి ఏనాటికి శాసనాలు
మీ ప్రభోదా లు హిందూ మత సంప్రదాయాలు
హిందూమత పరిరక్షణ మీ అవతార ద్యేయం
పరిపూర్ణం గా నిర్వహించిన సదాశివ స్వరూపం
అతి తక్కువ వయసునే నాలుగు మార్లు భూప్రదక్షిణం
తిరుగులేని ఆధిపత్యం అన్నిటా మీది, మీరు
కాదనలేని నియమాలను నిర్దేశించిన మార్గదర్శకులు
లోకానికి గురు పరంపర ఆవశ్యకత తెలిపిన జగద్గురువులు
గురువుల ప్రథమ వందనాలు అందుకునే జగద్గురువులు
నాటి నుంచి నేటికీ ఏనాటికీ మీరే జగద్గురువులు
వారిచ్చిన సందేశం యువత-ప్రేమ తోనే
నిలబెడదాం హిందూ ధర్మం… జై హింద్…