ఆడశిశువులు – కవిత

అమ్మకానికి 

ఆడశిశువులు

అయ్యో తల్లీ 

ఏమిటి ఈ వైపరీత్యం

కనేదొకరు

కొనేదొకరు

పెంచేదొకరు

పేదరికం 

పేగుబంధాన్ని 

జయించిందా?

ప్రాణం లేని నోటు

మాతృత్వాన్ని 

మింగేసిందా?