అశేష శేష జీవాణువులను ప్రాణాణువుగ మార్చి
అండాండ పిండాండ బ్రహ్మాండమైన పిండముగ తన అండమున పెంచి
ఒకటికి ఒకటి ఒనకూడు రూపముల తీరుగ తీర్చి
సృష్టి మర్మాన్ని నవమాసములు నర్మగర్భముగ ఓర్చినొప్పి తాను భరించి నవ
శిశువును ప్రసవించి…
అవనికి నవ జీవిని ప్రసాదించి…అనుకుందట..నేనాడపిల్లనని !
కన్నదీ మరో ఆడపిల్లనని !
భువికి చేరి, భువికి చేర్చు…బ్రతుకు నేర్చి, బ్రతుకు నేర్పు
ఒడి నాదని…బడి నేనని…ఆడపిల్ల నేనేనని !
బ్రతుకు వడిలో సడి లేని శాపం లా
మరెందుకు వెనుకబడి పోతోందిలా ?
పుడమికి చేరిన పాపది పాపమా, చేర్చిన తల్లిది పాపమా ?