ప్రేమలేఖ….

ప్రియమైన “నీకు”

          నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజేయాలని, ఈ లేఖ ద్వారా నా చిన్ని ప్రయత్నం. కానీ….

          నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా.. అని అనుమానం కలుగుతోంది. అంటే ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అని అనడం కన్నా, నిన్ను ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది.

          ఈ భావం ఎంత మధురంగా ఉంది అంటే 

          “నా నుండి నేను వేరయి నీలో కలసిపోతున్న భావన”

          అలా జరుగుతున్న పక్షంలో “నేను” అన్న పదానికి అర్థమే లేదు. అంటే..

          నువ్వు అంటేనే నేను…

          నేను అంటేనే నువ్వు…

నువ్వూ నేనూ ఒకటే అయినపుడు మనం కలిసిలేమనే భావనే లేదు..

          నువ్వు ఈ జన్మలో పంచిన ప్రేమకి ఋణం తీర్చుకోవాలంటే, నేను మరుజన్మ వరకూ ఆగాల్సిందే.

          మరుజన్మలో కల్మషం లేని ప్రేమని పంచేలా, నీకు తల్లిగా పుట్టించమని 

          లేదా..

          నీ ముక్కు పిండి మరీ ప్రేమని వసూలు చేసేలా, నీ కూతురుగా పుట్టించమని

          మృత్యువు సమీపిస్తున్న వేళ ఈ జన్మలో ఆ దేవుడి నుండి మాట తీసుకుంటాను….

          ఈ జన్మకు పరిపూర్ణంగా నీ ప్రేమని అందుకోలేని 

          నీ 

       అనుకునే 

          “నేను”

1 thought on “ప్రేమలేఖ….”

Comments are closed.