నన్నయ – కవిత

తెలుగు సాహిత్యానికి

తుది అడుగు వేసి

ఆది పర్వం లో

ఈ ఆంద్రమహాభారతాన్ని

మన ఆంధ్రులందరికీ

అందించిన ఆదికవి

మన నన్నయ…

భావితరానికి ఓ

వేదాంతంగా

నీతి, ధర్మశాస్త్రాలుగా

ఈ మహాకావ్యాన్ని

తన తొలి అక్షరంతో

రూపొందించిన లోకజ్ఞుడు

విపుల శాసనుడు, విజ్ఞాననిరుతుడని

అనడంలో సంశయములేదు

రెండవ వాల్మీకి అని

విశ్వనాధ సత్యనారాయణ అనడంలో

ఆశ్చర్యము లేదు

సంస్కృత ఛందస్సుకి

తెలుగు దుస్తులు తొడిగాడు

శ్రవణానందం అందిస్తూ

తెనుగు ప్రజలకి

ఎంతో అమృతానిచ్చిన

విపుల శాసనుడు….