ఓ మహర్షి! ఓ మహర్షి!
ఎవరు హితుడు? ఎవరు దుహితుడు?
ఎవరు మంచి? ఎవరు చెడుగు?
ఏది సత్యం! ఏది స్వప్నం!
ఆశ ఏల?! శోక ఏల?!
ఏది క్రాంతి? ఏది భ్రాంతి?
ఎవరిది ప్రేమ? ఎవరిదీ మొహం?
ప్రేమ పంచు! ప్రేమ కోరకు!
మన్ను మిన్ను కలిసేనా!!
మనిషి కూడ మారేనా?!!
ఎవరు నీకు? ఎవరు నాకు?
ఒక తలపు, ఒక వలపు
ఒక మనిషి, ఒక మనస్సు
ఓ మహర్షి ఓ మనిషి