పల్లవి: నా మనసుకు నచ్చిన అందం
చూస్తె మరువని రూపం
కనివిని ఎరుగని పరువం
నా ముందే మెరిసేలే
నా కలలకే దొరికేలే…
చరణం 1: నిన్ను చూసిన క్షణమంటే
ఉప్పెనలా ఆనందం ఉప్పొంగే
ఎందుకో తెలియని ఫీలింగే
నిన్ను మరి మరి చూడమంటుందే
నేనేరుగని నా మనసందే
నీ రూపం తోలచివేస్తోందే
చరణం 2: నీ చిరునవ్వుల చిరుజల్లే
బాధను చూపే సుఖమల్లే
ఎద అంచున ప్రేమల్లే
అనిపిస్తుంటే…
మనసెరుగని వైనం
మాటలకందని భావం
గుండెల్లో తలపిస్తుంటే…
పల్లవి: నా మనసుకు నచ్చిన అందం
చూస్తె మరువని రూపం
కనివిని ఎరుగని పరువం
నా ముందే మెరిసేలే
నా కళ్ళకే దొరికేలే