సాధించిరెంతో భారత ప్రాచీన పరిశోధకులు
కూర్చుండబెట్టిరి భారత ఘనత శిఖరాగ్ర సింహాసనంపై
నడిపించిరి భారతిని విజ్ఙానపు బాటలో
గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, వైద్యశాస్త్రం, రసాయనశాస్త్రం
అన్నింటిలోను అందుకున్నారు ప్రగతి ఆ రోజు
ఆరితేరారు భారతీయులు అన్ని విద్యల్లోను
ఏనాడో అభివృధ్ధి చెందిన భారతి
ఈనాడు అభివృధ్ధి చెందుతున్న భారతిగా
మారిపోవడానికి కారణం ఏది?
మనం చదివే చదువులా..? చేసే పనులా…?
అక్కరకు రాని ఆలోచనలా…అడుగేసే విధమా…?