ఋణమా? భాద్యతా? – కవిత

అవధులు లేని ప్రేమను పంచడమే అమ్మకు తెలుసు.

కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా పరుగెడుతుంది ఆమె మనసు.

కన్న బిడ్దల కోసం ఎన్ని కష్టాలనైనా సంతోషంగా భరిస్తుంది.

వారిని ఉన్నత స్థితిలో చూడాలని, ఆమె మనసు ఆకాంక్షిస్తుంది.

అలసిన శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంది.

కానీ, పిల్లల భవిష్యత్తు కోసం కొవొత్తిలా కరిగిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

మాతృహృదయ భావోద్వేగం ఒక తల్లికి తప్ప మరెవరికీ అర్థం కాదు.

తనివితీరని ఆ మాతృ ప్రేమను, వర్ణించే పదజాలానికి కరువే లేదు.

విలువైన బహుమతులనిచ్చి బదులు తీర్చుకోవడానికి, తల్లి ప్రేమ ఋణం కాదు.

త్యాగ శీలి అయిన ఆ తల్లి కోరే ఆప్యాయతానురాగాలు చూపించడం మన కనీస భాద్యత, కాదూ?

మాతృ దినోత్సవం ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదు, కాకూడదు.

అనుక్షణం తన బిడ్డల గురించి తపించే తల్లిని, తమ బిడ్డలా భావించి, ఒక తల్లిలా ప్రేమించగలిగే బిడ్డలకు,

కుటంబంలో ప్రతి దినం ఒక ఉత్సవమే!!!


అమ్మలందరికి అంకితము !!!