నేను భారతీయుడ్ని – కవిత

నేను భారతీయుడిని నేనూ ఒక భారతీయుడిని…

Am an Indian వందేమాతరం ..

Am proud to be an Indian అందాంఅందరం..

కులం వద్దు. మతం వద్దు.

మంచితనంపై సాగి పోదాం.

దేశం మనదే జెండా మనదే ..

జనమంతా మనవాళ్ళే..

సతమేదైనా మతమేదైనా 

సతమత బేధం వద్దు…

కులమేదైనా జాతేదైనా

జాతికులపిచ్చిరద్దు…

చత్రపతీ… మహాత్మ… స్వామీజీ…

సుభాష్…. భగత్.. అల్లూరి… ఎందరో…

మరెందరో… ఎందరెందరో..

తెచ్చిన స్వేచ్ఛయే ఇది.

అమరవీరుల ప్రాణం మన ఊపిరి..

మహాత్ముల శ్వాస మన ఆయువు…

కులాలు ఉన్నది కుట్రలకా…?

కాదు కాదు కలుపుటకు…

మతాలు ఉన్నది మంటలు రేపుటకా..?

 కాదు కాదు మంచిని పెంచుటకు

మందిని మార్చు మమతని పెంచు

మంచిని పంచు చెడుని తృంచు..

మంచి వాడనని చాటిచెప్పు..

భారతీయుడ్నని చెలరేగి చెప్పు…

Am proud to be an Indian