బక్కనగారిపల్లె అనే గ్రామంలో జానకమ్మ, రంగయ్య దంపతులకు నరేష్ అనే కొడుకు ఉండేవాడు. నరేష్ కి నత్తి ఉండటంతో అందరు నత్తి నరేష్ అని పిలిచేవారు. మనిషి అయితే పెరిగాడు కాని చాలా అమాయకుడు చదువు అసలు వచ్చేది కాదు. ఏడవ తరగతి పరీక్షలు వచ్చాయి పరీక్ష హాలులో పరీక్ష రాయకుండా నిద్రపోతూ ఉండగా ఇన్విసిలేటర్ వచ్చి నిద్ర లేపి ఏమైంది నిద్రపోతున్నావు అని అడగగా నా సావు రాదు ఎలా రాయాలి అంటాడు. టీచర్ భయపడిపోయి ఈ పిల్లవాడు చదువుకోలేదు ఏమో చనిపోతా అంటున్నాడు అని తన ఎదురుగ ఉన్న పిల్లవాడికి చెప్పి నరేష్ కి చూపించమని చెప్తుంది. నరేష్ ఆనందంగా మొత్తం చూసి రాస్తాడు.
పరీక్షా మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ అన్ని పేపర్స్ చెక్ చేస్తూ ఉండగా రెండు పేపర్స్ లో ఒకే పేరు రోల్ నెంబర్ చూసి అందరిని గమనిస్తాడు. మళ్ళి ఒక్కసారి పేపర్స్ అన్ని చూస్తె నరేష్ పేరు అందులో ఉండదు. వెంటనే నరేష్ నీ పేరు లేదు అని అడగగానే లేదు సార్ మేడం ముందు వాడి పేపర్లో చూసి రాయమన్నారు అందుకే వాడి పేరు రోల్ నెంబర్ రాసాను అంటాడు.
ప్రిన్సిపాల్ టీచర్ ని మందలించగా లేదు సార్ ఈ పిల్లవాడే నాకు సావు రాదు అన్నాడు నేను భయపడి కేవలం పాస్ అయ్యేవరకు కొన్ని చూపించమన్నాను అంటుంది.
నరేష్ లేదు లేదు నేను అలా అనలేదు నాకు సావు రాదు అన్నా అంతే అంటాడు అప్పుడు ప్రిన్సిపాల్ విషయం గ్రహించి ఇతడికి నత్తి ఉంది మేడం అందుకే చదువు అనే మాట సావు అంటున్నాడు. మీకు ఎదో అర్థం అయ్యింది. అక్కడ ఉన్న పిల్లలు అందరు నవ్వుతారు. అలా ఏదోలా పాట్లు పడి ఏడవ తరగతి కంప్లీట్ చేస్తాడు.
మళ్ళి ఇంకో రోజు వినాయక చవితి కావడంతో ఐదు మంది స్నేహితులతో కలిసి చందాలు అడగడానికి వెళ్తారు. ఒక ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే ఒక ఆంటీ బయటికి వస్తుంది. వెంటనే నరేష్ ఆంటీ వీధిలో వినాకుడు నిలబెత్తుతున్నాము మీరు దోచినంత చందా ఇవ్వండి అంటాడు. అంటి ఏంటి రా మేము దోచినంత ఇవ్వాల నువ్వు చూసావా మేము దోచుకున్నది అని చివాట్లు పెడుతుంది. వెంటనే పక్కనే ఉన్న స్నేహితుడు ఆంటీ వాడికి నత్తి ఉంది వాడు చెప్పేది వినాయక చవితికి వినయకుడిని వీధిలో నిలబెడుతున్నాము దానికి గాను మీకు తోచినంత చందా ఇవ్వమంటున్నాడు అనగానే అవునా సరే సరే అని చందా ఇచ్చి పంపుతుంది. ఇలా నరేష్ ని అందరు అపార్థం చేసుకుంటున్నారు. ఏమి చేయాలో అర్థం కాక ఇంట్లో నుండి బయటికి పోయేవాడు కాదు.
కాని ఒకరోజు నరేష్ అమ్మ చూడు నరేష్ మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలి కాని ఇలా ఇంట్లో కుర్చోరాదు ప్రతి మనిషికి ఎదో ఒక టాలెంట్ ఉంటుంది నువ్వు బొమ్మలు బాగా వేస్తావు కాదా పద నేను నిన్ను ఆర్ట్స్ నేర్పించే స్కూల్ లో జాయిన్ చేస్తాను అని జాయిన్ చేస్తుంది. ఐదు సంవత్సరాలలో నరేష్ ఒక గొప్ప చిత్రకారుడు అయ్యి రాష్ట్ర అవార్డు కూడా పొందుతాడు.
కథ బాగున్నది.