ప్రియా.. ఓ ప్రియా ..
స్వప్నంలో దాగున్నావా.. నా నీడలో నిలుచున్నావా
నా పాటలో పల్లవి నువ్వా.. నా మనసంతా నిండి ఉన్నావా
జగమంతా వెతికానే ప్రియా
|| ప్రియా ||
సూర్యోదయాన పూవువై.. వికసించే జాజి నవ్వువై
నెమలి ఆడిన నాట్యమై.. నా ఎదనే దోచిన ప్రియురాలివై
ఒక్కసారి కనిపించావే .. నా మనసును దోచేసావే
నాలో ఉన్న ప్రాణం నీవే .. నీకోసమే బ్రతికున్నానే
నీ నవ్వుల వర్షం కురిపించవా ప్రియా
|| ప్రియా ||
నా మనసులోని రూపానివే.. నా కనులపై కనుపాపవే
ప్రతి ఒక క్షణం నీ తలపే.. ఎక్కడ ఉన్నను నీ ధ్యాసే
నీ చిరునవ్వుల జాబిలిలో.. నీ కోయిల పాటల గానంలో
రామచిలుకలల రంగులలో .. ఇంద్రధనుస్సుల వర్ణాల్లో
సెలయేటి గలగలల అందాలు నీవేలే ప్రియా
|| ప్రియా ||