ఎవరికి లేదయ్యా కష్టం ఎక్కడ లేదయ్యా కష్టం.
ఈ రోజుల్లో కష్టం లేదనడం చాలా కష్టం.
తల్లి పురిటి నొప్పుల బాధ కష్టం ..
పసిబిడ్డ ప్రసవ కష్టం…
తండ్రి బరువు బాధ్యత కష్టం..
కుటుంబ పరువు కొరకు కష్టం..
అన్నం పండించే రైతన్న కష్టం..
ఆ అన్నం కోసం పేదవాని కష్టం..
ఉద్యోగి సంపాదన కష్టం..
నిరుద్యోగి శ్రమ కష్టం..
విద్యార్థి చదువు కష్టం…
ప్రేమికుల ప్రేమ కష్టం..
మొక్కకి నీరు కష్టం..
పశుపక్షాదులకు గ్రాస కష్టం..
స్నేహానికీ చెడు కష్టం…
శతృత్వానికి నేస్తం కష్టం…
అన్నీ కష్టాలే.. ఇది ఈ కాలపు ప్రపంచం..
దన్యవాదములు
Nice