సాగులో లేదు బాగు
రైతు చేసేది కన్నీటి సాగు
అప్పుల సుడిగుండాలు
నడ్డి విరిచే చక్రవడ్డీలు
వానదేవుడు కరుణించక
నకిలీ విత్తనాలు మొలకెత్తక
నకిలీ ఎరువులు పనిచేయక
పంట దిగుబడులు లేక
పండిన పంటకు విలువలు కట్టె
వ్యాపారుల మాయాజాలానికి బలై
లెక్కల తక్కెడలు సరితూగక
కళ్ళ ముందు చాంతాండంత
అప్పుల చిట్టాలు
గుండెల్లో కొండంత బరువు
మనసంతా వికలమై
గుండె చెదరి
బతుకు చితికి
పంటకు చల్లే పురుగుల మందు
రైతు గొంతులో జారింది
శ్వాస ఆగింది
బతుకు ముగిసింది
మట్టిని నమ్మిన రైతు
మట్టి గర్భంలో చేరె
కుటుంబం వీధుల పాలు
వారసుల భవిష్యత్తు కేది భరోసా