హృదయాన్ని… – కవిత

కలిసి ఉందామని ఎన్నో కలలు కన్నాను,

విడిచి ఉండలేము అని ఎంతో అనుకున్నాను,

కంటి పాపా కూడా నీ రూపాన్ని చెరపదు అనుకున్నాను,

కాని

హృదయాన్నే చీల్చి నీ జ్ఞాపకాలను తీసుకెళుతుంటే

మాటలొచ్చినా మాట్లాడలేక

ప్రాణం వున్నా పరుగు తీయలేక

పడివున్నానే ఈ ప్రపంచం తెలియని వాడిలా..