Amma Prema Poem by K. V. Kalyani
అమ్మప్రేమ
చదువురాని అమ్మయినా బిడ్డకి బుద్ది చెప్పగలదు
డబ్బులేని అమ్మయినా పిల్లల కడుపు నింపగలదు
కాళ్ళులేని అమ్మయినా బిడ్డకు నడక నేర్పగలదు
కళ్ళులేని అమ్మయినా వెలుగు దారి చూపగలదు
అవరోధాలను లెక్కచేయనిది అమ్మప్రేమ ఒక్కటే కదా!