నా జీవితంలో నేను అత్యంత ఆనందంగా గడిపిన సమయం
నీవు నాతో వున్న సమయం
నా జీవితంలో నేను అత్యంత బాధపడిన సమయం
నీవు నన్ను విడిచి స్వర్గానికి చేరుకున్న సమయం
నా జీవితంలో నేను అత్యంత ధైర్యంగా వున్న సమయం
నీవు నా ప్రక్కన నిదురించిన సమయం
నా జీవితంలో నేను అత్యంత ఇష్టపడేది
నీ పిలుపు
నా జీవితంలో నేను మరువలేనిది
నీ ప్రేమ
నీ జ్ఞాపకాలే ఊపిరిగా భావిస్తున్న నీ కూతురు- హిమ