Amma Goppathanam Poem by K. V. Kalyani

Amma Goppathanam Poem by K. V. Kalyani

అమ్మ గొప్పతనం

జాతి  ఏదయినా  అమ్మ పేరు అమ్మ
అమ్మ లేకుంటే బొమ్మ చేయడు బ్రహ్మ
తల్లి అంటేనే తల్లడిల్లేది అమ్మ
బాధ ఏదైనా చెమ్మగిల్లేది  అమ్మ
అమృతం లాంటి ప్రేమను పంచేది అమ్మ
అవని అందు అద్భుతమైనది అమ్మ
తొలి అడుగుల్లో తడబాట్ల ను
బ్రతుకు బాటలో పొరపాట్లను
సరిది ద్దేది  అమ్మ
తన ప్రాణాన్ని మరిచి నీ ప్రాణాన్ని కోరి జీవం పోసేది అమ్మ
ఉగ్గు పాలతో పెంచి మురిపాల నే పంచి
కని పెంచి, కనిపించు  నీ పాలి దేవతే అమ్మ
ఎల్లలు లేని ప్రేమకు రూపం అమ్మ
అపురూప కావ్యం అమ్మ

కవిత రచన: కుందేటి వెంకట కళ్యాణి

1 thought on “Amma Goppathanam Poem by K. V. Kalyani”

  1. అమ్మ గురించి వ్రాసిన కవితలు చాలా అద్భుతముగా కళ్ళు చెమర్చే విధముగా ఉన్నాయి. కిరణ్, కల్యాణి,వేణు, భమిడిపాటి గార్లు వారి హృదయాలను చక్కగా ఆవిష్కరించారు-వి.బి.యస్ .అయ్యంగార్,విజయవాడ. ఫోన్:9949413453

Comments are closed.