వినడానికి రెండక్షర పదం,
పిలవడానికి కొన్ని సెకండ్ల పిలుపు…
కానీ…
వర్ణించలేనంత ప్రేమ,
జన్మంతా నడిపించేంత నమ్మకం మా నాన్న…
ఏ భయమైనా దాటించేంత ధైర్యం,
ఏ ఆటంకాన్నైనా ఎదురుకునేలా చేసే ఓ ధీమా మా నాన్న…
వర్ణించేందుకు, ఆ ప్రేమను తెలిపేందుకు
ఏ కవితకైనా వీలుకాని ఒకే ఒక పదం నాన్న…
నా ప్రాణం… 🙂