పల్లవి : నమో భారత జనయిత్రి – స్వచ్ఛ భారత దివ్య ధాత్రి (2)
చరణం 1 : ప్రధాని పిలుపు – విశ్వానికి మేలుకొలుపు ,
స్వచ్చత , పరి శుభ్రత – కలగలిపిన విరి పానుపు ,
పరిసరాల సోయగాల పరిగొలుపు – ఆనంద జీవితం
ఎల్ల వేళలా హాయి గొలుపు … // నమో భారత //
చరణం 2 : శాస్త్రీజీ నినాదం – కష్టించి సాధించాలి హరిత విప్లవం
కలుపు తీసి , ఆరోగ్య పంటలను పెంచుదాం
ఆరోగ్యమైన ఆహారం , నిర్మల పరిసరాలతో
విశ్వ భారత అభివృద్ధిని గాంచు దాo … // నమో భారత //
చరణం 3 : గాంధిజీ కలలు గన్న స్వచ్ఛ భారతం స్వీయ కృషి తో
నిర్మించు కుందాం
తరతరాలుగా బాపూజీ సూచనలను పాటించుదాం,
ఆచరించుదాం
నిర్మలిన ఆరోగ్య భారతాన్ని అభివృద్ధి పరుచుదాం ..