ప్రపంచవ్యాప్తముగా ఎందరో ప్రముఖులు అన్ని రంగాలకు చెందినవారు ఉన్నారు వారి జీవిత చరిత్రలు భావి తరాల వారికి ఎంతో ఉపయోగము అందుచేత అటువంటి ప్రముఖులు వారి జీవిత చరిత్రలను వారే స్వయముగా రచించుకున్నారు అటువంటి స్వీయ జీవిత చరిత్రలలో, ప్రపంచానికి మంచి సందేశాలను ఇచ్చిన కొన్ని జీవిత చరిత్రలను క్లుప్తముగా తెలుసుకుందాము ఈ విధముగా క్లుప్తముగా తెలుసుకోవటం వల్ల వాటిని వివరముగా చదవాలి అనే ఆసక్తి ఏర్పడుతుంది ఈ నేల మీద నడయాడిన అటువంటి ప్రముఖుల జీవిత చరిత్రలను కొన్నింటిని తెలుసుకుందాము వాటిని చదవటం వల్ల పాఠకులు స్ఫూర్తిని పొందుతారు అనటము లో ఎటువంటి సందేహము లేదు. అటువంటి స్వీయ జీవిత చరిత్రలలో మొదటగా తెలుసుకోవలసింది 1..మన జాతిపిత మహాత్మ గాంధీ స్వీయ జీవితచరిత్ర ” మై ఎక్సిపెరిమెంట్స్ విత్ ట్రూత్ (సత్యముతో నా ప్రయోగాలు)”:- చరిత్రలో ఒక దేశానికి అహింస వాదముతో సత్యాగ్రహాల ద్వార స్వాతంత్రము తెచ్చిన ఘనత మహాత్మాగాంధీదే అయన జీవిత చరిత్ర సౌత్ ఆఫ్రికాలో జరిగిన అవమానాలతో ప్రారంభమవుతుంది ఈ జీవిత చరిత్రలో గాంధీ తన బాల్యము నుండి జరిగిన సంఘటనలను అవి తన జీవితముపై చూపిన ప్రభావాన్ని వివరిస్తాడు ఇది అయన వ్యక్తిగత చరిత్రకాదు మానవాళికి ఉపయోగపడే చరిత్ర ఈ పుస్తకము చదవటం ద్వారా గాంధీ సిద్ధాంతాలను మానవాళిపై వాటి ప్రభావాన్ని పాఠకులు అర్ధము చేసుకోగలరు ఈ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తముగా ఆదరణ లభించింది ఆదరణ లభించటమే కాకుండా మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా వంటి నాయకులకు వారి అహింసాయుత పోరాటాలకు స్ఫూర్తిదాయకం అయింది.
2. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ (స్వాతంత్రానికి సుదీర్ఘ నడక)-నెల్సన్ మండేలా :- సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ నాయకుడు తన దేశానికి స్వాతంత్రము కోసము సుమారు 26 సంవత్సరాలు జైలు జీవితమూ గడిపి అహింసాయుతముగా సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్రము సంపాదించి ఆ దేశానికి మొట్టమొదటి దేశాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు ఈయన స్వాతంత్రము కోసము చేసిన పోరాటం చాలా సుదీర్ఘ మైనది తన జీవిత చరిత్రలో మండేలా తానూ చిన్ననాటినుండి అనుభవించిన జాతి వివక్షతను అది తనను ఏవిధముగాస్వాతంత్ర సమారా యోధుడిగా ఎలా రూపొందించింది వివరిస్తాడు దాస్యములో మగ్గుతూ జాతి వివక్షతను అనుభవించిన జాతికి తానూ సుదీర్ఘకాలం జైళ్లలో గడిపి స్వాతంత్రము సాధించిన ఘనుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పోరాడిన యోధుడు ఈ నల్ల సూరీడుగా పేరు సంపాదించుకున్న నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చాలా విలువైన సమాచారాన్ని ఇస్తుంది.
3. ఆటోబయోగ్రఫీ ఆఫ్ మార్క్ ట్వైన్ -మార్క్ ట్వైన్:- మార్క్ ట్వైన్ స్వీయ జీవిత చరిత్ర అయన సుదీర్ఘ జీవితానికి రంగు రంగుల చిత్రపటము ఈ జీవిత చరిత్ర ఒక మంచి క్లాసిక్ గా పేరు సంపాదించుకుంది. ఎందుచేతనంటే ఈ జీవిత చరిత్రలో మార్క్ ట్వైన్ తన జీవితములో పోషించిన విభిన్న పాత్రల గురించి వివరిస్తాడు. ఈ జీవిత చరిత్ర పూర్తిగా ప్రత్యేకమైన శైలి,ఊహాత్మకము,హాస్యము మరియు విషాదముల తో మేళవించబడింది. అందుకే విమర్శకులు ఈ జీవిత చరిత్రను ” కలర్ ఫుల్ రెప్రెసెంటేషన్ ఆఫ్ హిస్ లాంగ్ లైఫ్ “అని వర్ణిస్తారు.
4. ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ బెంజిమన్ ఫ్రాంక్లిన్ బై బెంజిమన్ ఫ్రాంక్లిన్ :-బెంజిమన్ ఫ్రంక్లిన్ మధ్య తరగతి యువకునిగా జీవితమూ ప్రారంభించి అమెరికాలోనే కాకుండా ప్రపంచము మొత్తములో మెచ్చుకొని వ్యక్తిగా ఎదిగాడు ఆ విధముగా అమెరికా జాతి నిర్మాణములో ప్రముఖ పాత్ర పోషించాడు. అమెరికన్ కల సాధనలో ఆయనకు ఉన్న దృఢమైన నమ్మకము ఆశావాదం,మేధావితనం, సిద్ధాంతాల పట్ల నమ్మకము మొదలైన విషయాలను తన జీవిత చరిత్రలో వివరిస్తాడు. ఈ మొత్తము జీవిత చరిత్ర నాలుగు భాగాలుగా ఉంది చదవటములో పాఠకుల ఆసక్తిని రేకెత్తిస్తుంది.
5. ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ బై అని ఫ్రాంక్ :-రెండవ ప్రపంచ యద్దము సమయములో యూదుల పట్ల నాజీల దురాగతాలను ప్రపంచానికి తెలియజేయటం ద్వారా ఫ్రాంక్ ప్రపంచ వ్యాప్తముగా పేరు సంపాదించుకుంది. డచ్ రాజధాని అంస్టర్ డామ్ లో ఒక రహస్య ప్రదేశములో తన కుటుంబము మరియు ఇతర నలుగురు సభ్యులతో సుమారు రెండు సంవత్సరాలు అంటే 1942 నుండి 1944 వరకు ప్రాంక్ దాక్కుంది. దురదృష్ట వశాత్తు నాజీలు రెండవ ప్రపంచ యుద్ధము ఇంకొక సంవత్సరములో ముగుస్తుంది అనగా వీరిని బంధించి కాన్సెన్ట్రేషన్ క్యాంప్ లకు తరలించారు. ఫ్రాంక్ తన రహస్య జీవితమూ గడుపుతున్నప్పుడు నిముషం నిముషానికి జరుగుతున్నా అన్ని సంఘటనలను తన డైరీలో వివరించింది ఆ డైరీయే ఫ్రాంక్ జీవిత చరిత్ర మరియు నాజీల దురాగతాలకు ప్రత్యక్ష నిదర్శనము ఆ విధముగా ఫ్రాంక్ గడిపిన రహస్య జీవితాన్ని డైరీ రూపములో పెట్టటం వల్ల ప్రపంచానికి ఎన్నో విషయాలు తెలిసినాయి.
6.క్రానికల్స్ వాల్యూమ్ బై బాబ్ డైలాన్ :- ఇది ఒక సంగీత ప్రముఖుడి జీవిత చరిత్ర సంగీత ప్రియులు తప్పనిసరిగా చదవ వలసినది. ఇది మొత్తము మూడు వాల్యూమ్స్ గా ఉంటుంది మొదటి వాల్యూమ్ ముఖ్యముగా మూడు ఎన్ను కున్న అంశాలపై వివరించబడింది ఆ అంశాలు 1961,1970 మరియు 1989 మధ్య కాలము లోనీవే. డైలాన్ తన అనుభవాలు మొదటి ఆల్బమ్ రికార్డింగ్ దగ్గరనుంచి వివరిస్తాడు.ఆల్బమ్స్ రికార్డింగ్స్ లో డైలాన్ చూపే డెడికేషన్ అర్ధమవుతుంది
7. పంజరంలోని పక్షి ఎందుకు పాడుతుందో నాకు తెలుసు (ఐ నో వై ద కేజ్ డ్ బర్డ్ సింగ్స్) బై మయ ఏంజిలో :-మయ ఏంజిలో నిజానికి ఆవిడా జీవిత కాలములో ఏడు స్వీయ చరిత్రలు వ్రాసింది. కానీ వాటన్నిటిలో ఆవిడకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది మొదటిదే మొదటి స్వీయ చరిత్ర లో ఆవిడ అమెరికాలోని ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలు జాతి వివక్షతకు గురి అవుతున్నప్పుడు యదార్ధ పరిస్థితిని వివరిస్తుంది. ఈ జీవిత చరిత్ర సాహిత్యములో చాలా విలువైనది జీవితములో ఏంజిలో పడ్డ కష్టాలను ఆ కష్టాలను ఎలా అధిగమించి జీవనము సాగించింది అన్ని వివరిస్తుంది ముఖ్యముగా తానూ తన తల్లి ప్రియుడి వల్ల మానభంగము అయినప్పుడు పొందిన మానసిక వేదన భయము అన్నింటిని తన స్వీయ చరిత్రలో వివరిస్తుంది.
8. ఆగతా క్రిస్టి :-“యాన్ ఆటోబయోగ్రాఫి” బై ఆగతా క్రిస్టి :-ఈ విడ నవలలు ప్రపంచములో బాగా పేరుపొందినవి కానీ ఆవిడా జీవితమూ గురించి ఎక్కువగా ప్రపంచానికి తెలియదు నిజానికి ఆగతా క్రిస్టి జీవితమే ఒక పెద్ద మిస్టరీ ఆవిడా జీవిత చరిత్ర లో తన బాల్యము,తల్లి తో ఆవిడకు ఉన్న మంచి అనుబంధము, తరువాత జీవితములో ఎదురైనా బాధాకరమైన సంఘటనలు ఆవిడా జీవితాన్ని ఎలా దిగజార్చినాయో తెలియజేస్తుంది. తన జీవిత చరిత్రలో తన నవలల గురించి లోకము ఏమనుకుంటుందో ఏ రకమైన బేషజాలు లేకుండా వివరిస్తుంది కాబట్టి ఈ జీవిత చరిత్ర చదవటం వల్ల ఒక వ్యక్తి జీవితాన్ని అన్ని కోణాల్లో అధ్యయనము చేయవచ్చు.
9. “ఆన్ రైటింగ్ :ఎ మెమొయిర్ ఆఫ్ ద క్రాఫ్ట్ ” బై స్టీఫెన్ కింగ్ :- స్టీఫెన్ కింగ్ సుమారు 350 మిలియన్ల హర్రర్ (భయంకర మైన) అమ్ముడైన నవలల రచయిత ఈయనకు కింగ్ అఫ్ హర్రర్ అనే పేరు కూడా ఉంది. కానీ విశేషము ఏమిటి అంటే ఈయన స్వీయ జీవిత చరిత్ర లో ఏవిధమైన భయంకర సన్నివేశాలు ఇతివృత్తాలు ఉండవు. దీనిలో అయన వ్యక్తిగత చరిత్ర స్వానుభవాలు వివరించబడ్డాయి రచయితగా బాగా పేరు సంపాదించక మునుపు పడ్డ కష్టాలు ఇబ్బందులు పేరు వచ్చినాక జీవితములో మార్పులను తన జీవిత చరిత్రలో వివరిస్తాడు. కింగ్ తానూ హర్రర్ నవలా రచయితగా ఏదగటానికి తోడ్పడ్డా కొన్ని రహాస్యాలను కూడా ఈ జీవిత చరిత్రలో వివరిస్తాడు. ఒక హార్రర్ నవల రచయితా స్వానుభవాలు చదవటానికి చాలా బాగుంటాయి.
10. ఎ మూవబుల్ ఫీస్ట్ బై ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే :- ఎర్నెస్ట్ హెమ్మింగ్ వే అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత మరియు జర్నలిస్ట్ ఈయన జీవిత చరిత్రలో పేర్కొన్న సంఘటనలు ఒక క్రమ పద్దతిలో లేకపోయినప్పటికీ పాఠకుల ను ఆసక్తిగా చదివేటట్లు చేస్తాయి.ఈ చరిత్రలో హెమ్మింగ్ వే ఆలోచనలు ఆయనను ఏవిధముగా ఒక రచయితగా తయారు అవటానికి దోహదపడ్డాయి వివరిస్తాడు. అంతేకాకుండా అనేక అంశాలపై అయన తన నిర్దిష్ట అభిప్రాయాలను తెలియ జేస్తాడు.ఇవండీ ప్రపంచ సాహిత్యములో కొన్ని ముఖ్యమైన ప్రముఖుల స్వీయ జీవిత చరిత్రలు వీటిని చదవటంవల్ల వారు ఎందుకు అంత ప్రముఖులు అయ్యారో మనము అర్ధము చేసుకోవచ్చు అలాగే వారిని ఆదర్శముగా తీసుకొని మన జీవితాలను కూడా మంచి మార్గములో నడిపించుకోవచ్చు మంచి సమాజము కొరకు కృషి చేయవచ్చు.