Kaalamandinche Saayam

Kaalamandinche Saayam

కాలమందించే సాయం

ఒంటరి బతుకు అతుకులమయం..
ఎవరెవరో చేసిన గాయాలకు
చిన్నాభిన్నమైన బతుకుకి..
అన్నీ శస్త్ర చికిత్సలే..॥

మనస్సుకు కాయానికి
అయిన గాయాలకు సాయంగా
కాలమే వస్తుంది..॥

గాయాలను మాన్పడానికి
నీకు సాయం చేస్తుంది..॥
తానే ఒక మందని గురుతు చేస్తుంది..॥

కాలమా..
నీకు ధన్యవాదాలు..॥
ఎవ్వరు వేరైనా
ఏది ఏమైన..
మరలా మంచి రోజులున్నాయని
నాకు ఓదార్పైనందుకు..॥
చేదోడైనందుకు..॥

కవిత రచన: మీ లక్ష్మి
Kaalamandinche Saayam kavita by Mee Lakshmi
Kaalamandinche Saayam kavita by Mee Lakshmi

For more poems of Mee Lakshmi: Click here