Illaalu Orpu
ఇల్లాలు ఓర్పు
బాధ ఎంతైనా సహించే ఓర్పు
సంతోషం ఏదైనా రెట్టింపు చేస్తే నేర్పు
నీ సొంతం..।।
త్యాగం నీ నైజం..
నీ వారి క్షేమమే నీ స్వార్థం..!!
కాలం పరిగెడుతుంటే..
దానితో పందెం వేసేలా
ఉంటుంది నీ వేగం..!!
నీ పనికి ఆశించవు ఏ జీతం..
కోరవు ఏ బహుమానం..!!
మమకారం చాటున
దాచుకొని నీ అహం
నీ కుటుంబానికి పంచేవు
అమితమైన అనురాగం..!!
నీ చీర కొంగే ..
నీ చమట చుక్కని
నీ కన్నీటి బొట్టును..
తుడిచే స్నేహం..!!
నువ్వింటికి దీపం
సహనానికి రూపం..!!
చీకటిలోనే దాగి
వెలుగునిచ్చు ఓ కిరణం..!!
కవిత రచన: మీ లక్ష్మి
For more poems of Mee Lakshmi: Click here