చిరునవ్వుల చిన్నదాన… చిత్రమైన నెరజాణ…
నెమలి వర్ణపు రూపుదాన.. నీకు సాటి ఎవరే జానా..
పసిడి పొదిగిన కొయ్య బొమ్మ మల్లె విరిసిన పూల కొమ్మ
తీపి స్వరముల కోయిలమ్మ నీలి మేఘపు జాబిలమ్మ
తిలకించు నిను చూడ కోటి కన్నులు సరిజాలవే
నిను తలపించు నా మదిపై కాసైనా జాలిచూపవే
గడియ గడియ గుడి గంటలా నా గుండెన మోగగా
అడుగు అడుగు పసిపాప వాలే నీ వెనుక సాగగా
నీ పరిచయాన నాకు నేనే పరదేశిల కనిపించగా
నీతో సాగిన ప్రయాణాన నా ఉనికిడి మారిపోయేనుగ
తొలి ప్రేమ ఇంద్రజాలం చెలి ఇది, ప్రళయమై నాలోన పొంగగా మరవలేని మధురభావం ఇది మరి, కవనమై నా కలమును కదుపగా